ప్రముఖ సినీ నిర్మాత అశ్వినీదత్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొని మొక్కలు నాటారు. ఏపీలోని నర్సాపూర్ ఎంపీ రఘరామకృష్ణంరాజు విసిరిన గ్రీన్ ఛాలెంజ్‌ను అశ్వినీదత్ స్వీకరించి తన కుటుంబ సభ్యులతో కలిసి మొక్కలు నాటారు. నగరంలోని గచ్చిబౌలిలో గల తన నివాసంలో ఆయన తన కుమార్తె ప్రియాంక దత్, మనవడు రిషి కార్తికేయలతో కలిసి మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ వ్యవస్థపాకుడు రాఘవ, హెల్పింగ్ హాండ్స్ ప్రతినిధి సుబ్బారాజ్ పాల్గొన్నారు. అనంతరం అశ్వినీదత్ మాట్లాడుతూ.. ఎంపీ సంతోష్ కుమార్ గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టారన్నారు. జబ్బులకు, కాలుష్యానికి దూరంగా ఉండాలంటే ప్రతీ ఒక్కరూ మొక్కలు నాటాలన్నారు. మరో ముగ్గురికి అశ్వినీదత్ గ్రీన్ ఛాలెంజ్‌ను విసిరారు. దర్శకుడు రాఘవేంద్రరావు, హీరో విజయ్ దేవరకొండ, కాకినాడ పోర్ట్ చైర్మన్ కే.వి.రావు, డాక్టర్ జయంతిలకు ఆయన గ్రీన్ ఛాలెంజ్‌ను విసిరారు.
కుటుంబ సభ్యులతో కలిసి మొక్కలు నాటిన అశ్వినీదత్