కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో ప్రవేశపెట్టనున్న 2020 సార్వత్రిక బడ్జెట్‌పై సానుకూల అంచనాలు నెలకొన్న నేపథ్యంలో భారత స్టాక్ మార్కెట్లలో సందడి నెలకొంది. ఇవాళ ట్రేడింగ్ ప్రారంభంలో కొద్ది సేపు ఊగిసలాడిన తర్వాత క్రమంగా దేశీయ మార్కెట్లు లాభాల బాట పట్టాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 90.46 పాయింట్ల లాభంతో 40,813.95 వద్ద కొనసాగుతుండగా... నిఫ్టీ 22.10 పాయింట్ల లాభంతో 11984.20 వద్ద ట్రేడవుతోంది. వచ్చే ఏడాది జీడీపీ వృద్ధి రేటు 6.5 శాతానికి చేరే అవకాశం ఉందన్న అంచనాలతో పాటు ప్రస్తుత ఆర్ధిక మందగమనానికి చెక్ పెట్టేలా కేంద్రం విరుగుడు చర్యలు తీసుకుంటుందన్న ఆశాభావం మార్కెట్లలో నెలకొన్నట్టు విశ్లేషకులు చెబుతున్నారు.
2020 బడ్జెట్: ఆశల పల్లకిలో స్టాక్ మార్కెట్లు