శాసన మండలి రద్దు తీర్మానాన్ని కేంద్రానికి పంపించాం. ప్రొసీజర్ ప్రకారమే అన్నీ జరుగుతాయి’’ అని శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారామ్ అన్నారు. శుక్రవారం ఉదయం ఆయన విమానాశ్రయంలో విలేకరులతో మాట్లాడారు. చట్టం ఎవరికీ చుట్టం కాదని, అన్నీ చట్టం ప్రకారమే జరుగుతాయన్నారు. గతంలో ఎన్టీఆర్ సీఎంగా వున్న సమయంలో కూడా మండలి రద్దు జరిగిందన్నారు. శాసన మండలికి సంబంధించి ఇతర రాష్ట్రాల తీర్మానాలు పెండింగ్‌లో వున్నా అన్నీ ముందుకు వెళతాయని అన్నారు. రాజధాని రైతులకు ఇతర రాష్ట్రాల రైతులు మద్దతు ప్రకటించడం గురించి ప్రస్తావించగా ఆర్టిఫీషియల్ ఉద్యమాల గురించి తాను మాట్లాడబోనని సమాధానమిచ్చారు. నిజంగా ప్రజా ఉద్యమం జరిగితే అందరం మద్దతు ఇద్దామని అన్నారు.
కృత్రిమ ఉద్యమాల గురించి మాట్లాడను:స్పీకర్