కరోనా వైరస్‌పై పోరాటంలో భాగంగా ప్రభుత్వాలు చేస్తున్న సహాయక చర్యలకి తోడుగా నిలుస్తున్నారు సినీ సెలబ్రిటీలు. ఇప్పటికే పలువురు సినీ సెలబ్రిటీలు పీఎం సహాయనిధితో పాటు రాష్ట్ర ముఖ్యమంత్రుల సహాయనిధికి భారీగా విరాళాలు అందించారు. తాజాగా గానకోకిల లతా మంగేష్కర్ మహారాష్ట్ర ముఖ్యమంత్రి సహాయనిధికి రూ.25 లక్షల విరాళాన్ని అందిస్తున్నట్టు ప్రకటించారు.మహారాష్ట్రలో కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో లతా మంగేష్కర్ తన ఉదారతని చాటుకున్నారు. మహారాష్ట్రలో కరోనా వైరస్ వలన ఇప్పటి వరకు ఎనిమిది మంది మృతి చెందగా, 200కి పైగా వైరస్ భారిన పడ్డారు.