లక్నో: రాష్ట్రంలో కరోనా వైరస్ కేసుల సంఖ్య పెరుగుతుడటంతో ప్రైవేట్ ఆస్పత్రులు, క్లినిక్‌లను తెరడానికి ఉత్తరప్రదేశ్ సీఎం ఆదిత్యనాథ్ అనుమతించారు. దేశవ్యాప్తంగా 21 రోజుల లాక్‌డౌన్ నేపథ్యంలో ప్రైవేట్ హాస్పిటళ్లు, క్లినిక్‌లు మూతపడ్డాయి. అయితే రాష్ట్రంలో నమోదైన కరోనా పాజివ్ కేసులతోపాటు, ఉత్తరప్రదేశ్‌కు చెందిన వలస కూలీలు ఢిల్లీ, పరిసర రాష్ర్టాల నుంచి పెద్దసంఖ్యలో సొంత ఊర్లకు తరలి వెళ్లడం, వారిలో కరోనా బారినపడినవారు, అనుమానితులతో ప్రభుత్వ దవాఖానలపై ఒత్తిడి అధికమైంది. దీంతో రాష్ట్రంలోని అన్ని ప్రైవేట్ హాస్పిటళ్లు, క్లినిక్‌లు తెరిపించాలని, వాటికి తగిన వసతులు కల్పించాలని ఆ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జిల్లాల అధికారులను ఆదేశించారు.
కరోనా బాధితుల కోసం ప్రైవేట్ హాస్పిటళ్లు, క్లినిక్‌లు